అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి
రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి(Sri Sri Sri Ayyappa Swamy) ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్,పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులతో కలసి ఆయన ప్రారంభించారు.
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి, నరేందర్ రెడ్డి అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేయడం సంతోషం అంటూ నరేందర్ రెడ్డి ని ఎమ్మెల్యే అభినందించారు, ముందుగా అయ్యప్ప స్వాముల నూతన విరి, వంటశాలను విజయ రమణారావు ప్రారంభించారు,ఈ కార్యక్రమంలో నిత్యాన్నదాన శిబిరం నిర్వాహకులు సాయిరి పద్మ మహేందర్ దంపతులు, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ , మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు , ముత్యాల రవీందర్, కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న ), కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.