ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్లక్ష్యం
26-11-2026 | 09:45pm
వాంకిడి(విజయ క్రాంతి): మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో(Government office) అధికారుల నిర్లక్ష్యంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ మండల కార్యదర్శి కొదురుపాక మహేష్ ఆరోపించారు. రెవెన్యూ, పోలీసు, విద్యాశాఖల్లో ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అనుమానాస్పదంగా కొనసాగుతున్న ప్రైవేటు పత్తి కాంటాలపై అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి, తూకంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను తిప్పించకుండా పారదర్శకంగా సేవలు అందించాలని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేపడతామని మహేష్ హెచ్చరించారు.