ఖాకీల కాసుల వేటకు లిక్కర్ మాఫియా అండ

10-10-2026 | 05:25am

బెల్ట్ వ్యాపారానికి ఖాకీల దండ 

కరీంనగర్ క్రైం అక్టోబర్ ౯ (విజయక్రాంతి): జిల్లాలో పోలీసుల అవినీతికి మ ద్యం దుకాణాలు(Liquor shops) అండగా నిలుస్తుంటే మద ్యం వ్యాపారుల బెల్ట్ దందాకు పోలీస్ శాఖ (Police Department)సహకారం అందిస్తుంది. కరీంనగర్ జిల్లాలో రెండు శాఖలు పరస్పరం సహకరించుకుం టూ యథేచ్ఛగా జేబులు నింపుకుంటున్నాయనాడానికి తిమ్మాపూర్ పోలీసుల పై చర్యలే నిదర్శనం. పోలీసు యంత్రాంగం త మ అవినీతి సొమ్ముకు మద్యం దుకాణాలు, పెట్రోల్ పంపులు,హోటల్ వ్యాపారాలను యథేచ్ఛగా వాడుకుంటున్నారు.

అయితే ఇ దంతా కొత్తగా పుట్టుకువచ్చిందేమి కా దు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి మద్యం మా ఫి యాపై ఏసీబీ దాడులు నిర్వహించినప్పు డే బయటపడింది. అప్పుడే పదుల సంఖ్య లో అధికారులు తమ పోస్టింగులు పోగొట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగిన సందర్భాలు ఉ న్నా యి. తాజా ఘటనతో మరోసారి మద్యం మాఫియాకు పోలీస్ శాఖకు లింకులు బయటపడ్డాయి.

కొత్త సీసాలో పాత సారాయి

కేసులో ఉన్న వాహనాలను విడిచిపెట్టేందుకు డబ్బులు డిమాండ్ చేసి అడ్డంగా దొరి కిపోయిన పోలీసులు కూ డా ఆ అవినీతి సొ మ్మును మద్యం దుకాణం ద్వారానే తీసుకున్నట్లు నిర్ధారణ కావడం తో చర్యలు తీసుకు న్నట్లు సమాచా రం. అయితే ఇదంతా ఏళ్ల తరబడిగా కొనసాగుతున్న తంతు అని తెలు స్తుంది. నాటి నుంచి నేటి వరకు పోలీసులు తమ కాసుల కక్కుర్తి కి మద్యం వ్యాపారుల మీద ఆధారపడుతున్నారు. పాత సీసాలో కొత్త సారాయి లాగా వ్యాపారులు మారిన అధికారులు మారిన వ్యవహారం మాత్రం మారలేదని తెలుస్తుంది.

కొలువులు పోయినా మారని ఖాకీల తీరు

మద్యం వ్యాపారంలో ఉన్నవారి తో చెత్తపట్టలు వేసుకొని తిరిగిన పోలీసులు యేళ్లు గడిచిన తీరు మార్చుకోలేదన్నది వాస్తవం. ఉమ్మడి రాష్ట్రం లో మద్యం సినిడికేట్ పై ఏ సీబీ రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేసింది. ఆ సమయంలో చాలా మంది పోలీస్ అధికారులు తమ పోస్టింగులు కూడా పోగొట్టుకొని కోర్టుల చు ట్టూ తిరిగారు.అందులో చా లా మంది ఇప్పుడు పదవి విరమణచేసినప్పటికీ నేటి అధికారులు కూడా మద్యం వ్యా పారులను తమ అవినీతికి పావులుగా వాడుకుంటున్నారు.

కరీంనగర్ కమిషనరేట్ లోని తిమ్మాపూర్ పోలీసులు కూడా యిలాగే దొ రికిపోవడంపై కొలువులు పోయిన ఖాకీల తీ రు మారలేదని విమర్శలు వినిపిస్తున్నా యి. ఇవే కాకుండా అర్బన్ ప్రాంతాలలో పో లీసు అధికారులు తమ కాసుల కక్కుర్తి కో సం పె ట్రోల్ పంపులు,హోటల్ వ్యాపారుల ను కూ డా వాడుకుంటున్నారు. స్టేషన్ బిల్లు ల పేరి ట సమీపంలో ఉన్న వ్యాపారస్తులను కూడా వినియోగించుకుంటున్నారు.

ఏది ఏ మైనప్పటికీ పోలీసుల అవినీతికి బలవుతు న్న వ్యాపారుల పరిస్థితి కూడా దయనీయ ంగా మారింది.వద్దంటే వ్యాపారం జరగదు. సరే అంటే సజావుగా ఉండదు అన్నట్లు త యారయ్యింది. ఇకనైనా ఖాకీ చొక్కలకు మద్యం మరకలు అంటకుండా మరోసారి ఏసీబీ అధికారులు దృష్టి సారించాలేమో మరి.

మరిన్ని వార్తలు