విధుల్లో చేరిన పంతులమ్మ
బెజ్జూర్ అక్టోబర్ 9 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని పాపన్నపేట (బుజాడి వాడ) ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యా యురాలు(Government school teacher) ‘విజయక్రాంతి‘ కథనానికి శుక్రవారం విధుల్లో చేరారు. వర్క్ అడ్జస్ట్మెంట్ విధానంలో ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు రిజ్వానా రజ్వి కాగజ్నగర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తుంది. (బుజాదివాడ) పాఠశాలలో 5 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, విద్యార్థుల తల్లిదండ్రులు సమస్య తెలిపారు.
ఇట్టి విషయమై విజయ క్రాంతి దినపత్రికలో ‘వర్క్ అడ్జస్ట్మెంట్..విద్యార్థులకు శాపం ‘ అనే కథనం ఈనెల 5వ తేదీన వచ్చిన కథనానికి జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారి స్పందించారు. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు మండల విద్యాధికారి డాక్టర్ సునీత చర్యల్లో భాగంగా ఉపాధ్యాయురాలు రిజ్వాన రజ్వి కి సోకస్ నోటీస్ జారీ చేశారు.
దీనితో ఉపాధ్యాయురాలు శుక్రవారం పాపన్నపేట బుజాడివాడ పాఠశాలలో విధుల్లో చేరారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించినందుకు విజయ క్రాంతి పత్రిక యజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.