బాండ్‌పై వివాదం! అశోక్ ఆరోపణలు నిరాధారం
- తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు
- ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలి
- విల్సన్ అగ్రి సైన్స్ రైతుల డిమాండ్
కన్నాయిగూడెం,అక్టోబర్ 10(విజయక్రాంతి): శుక్రవారం రోజున విల్సన్ అగ్రి సైన్స్ Wilson Agri Science Bond పై పలు దినపత్రికల్లో వచ్చిన ఆరోపణల్లో ఎంత వరకు నిజం లేదని ఏటూరు, సింగారం చింతగూడెం, బుట్టాయిగూడెం, ముప్పనపల్లి, గూర్రేవులకు చెందిన 25నుంచి 30మంది రైతులు స్పష్టం చేసారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే ముప్పనపల్లి గ్రామానికి చెందిన నరెడ్ల అశోక్ అనే వ్యక్తి విల్సన్ అగ్రిసైన్స్ బాండుపై చేసిన ఆరోపణలల్లో ఎలాంటి నిజాలు లేవని తన వ్యక్తిగత స్వార్థం కొరకు మాత్రమే ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు తప్పుడు సమాచారం ఇచ్చారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
కంపెనీ ప్రతినిధుల నిబంధన మేరకు మాత్రమే మిర్చి పంటలు వేస్తున్నామని,పంటను పండించే సమయంలో కంపెనీ ప్రతినిధుల సూచనల మేరకు మాత్రమే పురుగు మందుల పిచికారీ, ఎరువులు అందించడం జరుగుతుందని తెలిపారు. కంపెనీ ప్రతినిధులు కానీ ఫర్టిలైజర్ యజమానులు(Fertilizer business owners) కానీ ఎక్కడా కూడా తమను ఇబ్బందులకు గురి చేయడం లేదని పలువురు రైతులు స్పష్టం చేసారు.ముప్పనపల్లి గ్రామానికి చెందిన నరెడ్ల అశోక్ వద్ద విల్సన్ అగ్రి సైన్స్ రైతులను మోసం చేసినట్టు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని పలువురు రైతులు పిలుపునిచ్చారు. నిన్నటి వరకు కూడా నరెడ్ల అశోక్ కూడా విల్సన్ బాండ్ పై పంటలు పండించి ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని పలువురు రైతులు పేర్కొన్నారు.
విల్సన్ అగ్రి సైన్స్ కంపెనీతో ఒప్పందం ద్వారా మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ధరకు తమ పంటలను కొనుగోలు చేసి,నిర్దేశించిన గడువులోపు రైతుల బ్యాంకు ఖాతాలో(farmers' bank accounts) డబ్బులు వేయడం జరుగుతుందని అన్నారు. కన్నాయిగూడెం మండలం నుంచి వరంగల్ వెళ్లి మార్కెట్ లో అమ్మినా కూడా మార్కెట్ టాప్ రేట్ వచ్చే అవకాశం లేదని, మార్కెట్ లో దళారులు తక్కువ రేట్లకు అడిగిన సందర్భాలు ఉన్నాయని, అలాంటి సమయాల్లో విల్సన్ అగ్రి సైన్స్ కంపెనీ ప్రతినిధులు ఇంటి వద్దనే మార్కెట్ టాప్ రేట్లకు మిర్చి కొనుగోలు చేయడం జరుగుతుందని, కంపెనీ ప్రతినిధులు రైతులకు మంచి చేస్తున్నా కూడా కొందరు కావాలని కంపెనీపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని, ఆరోపణలు చేసిన అశోక్ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నా కూడా బహిరంగ చర్చకు రావాలని పలువురు రైతులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న రైతులు కుర్సం శివ,పళ్ళ వెంకటేశ్వర్లు, తడకల మధుకర్, వనపర్తి తిరుపతి, బుద్దె గౌరయ్య, సుబ్బుల సమ్మయ్య, సుబ్బుల సంజీవ్, బైరవేణి రమేష్, చిలకమరి శ్రీధర్, జంగ కృష్ణ, గోస్కుల లాలయ్య, తొంగళి సుమన్, అచ్చ ముత్తయ్య,అబ్బు సంపత్, బుద్దె చిట్టిబాబు తిప్పనపల్లి విజయ్, తిప్పనపల్లి ప్రవీణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
గోస్కుల లాలయ్య, చింతగూడెం రైతు
విల్సన్ కంపెనీ ప్రతినిధులు బద్నామ్ చేయడం మానుకోవాలి. నిన్నటి రోజున పలు పేపర్లలో వచ్చిన కథనం, ప్రకటన ఇచ్చిన వ్యక్తి పూర్తి అబద్దం. నేను గతంలో ఇతర బాండ్ లో మిర్చి అమ్మిన. ఇతర మిర్చి బాండ్ల కంటే విల్సన్ అగ్రి సైన్స్ కంపెనీ చాలా మంచిది. కంపెనీ వాళ్ళు చెప్పిన మందులు పిచికారీ చేయడంతో మార్కెట్ It's కంటే ఎక్కువ పెట్టి మిర్చి పంటను కొనుగోలు చేసారు. నా స్వంత బ్యాంకు ఖాతాలో డబ్బులు వేశారు.. తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలి.
అచ్చ ముత్తయ్య, ముప్పనపల్లి రైతు
నేను గత సంవత్సరం 220క్వింటాల మిర్చి విల్సన్ అగ్రిసైన్స్ కంపెనీకి అమ్మిన.కంపెనీ ప్రతినిధులు చెప్పిన రేట్ ఇచ్చారు. నా స్వంత బ్యాంకు ఖాతాలో డబ్బులు చెప్పిన సమయంలో వేశారు. కంపెనీ ప్రతినిధులు బద్నామ్ చేయడం మానుకోవాలి. మార్కెట్ రేట్ కంటే ఎక్కవ పెట్టి ఇంటి దగ్గరే కొనుగోలు చేసారు.విల్సన్ అగ్రిసైన్స్ రైతుల పాలిట వరం...