బందోబస్తు విధుల్లో పోలీస్ సిబ్బందికి రోడ్డు ప్రమాదం

25-09-2026 | 03:30pm

కరీంనగర్ క్రైం, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): గణేష్ నిమజ్జనం(Ganesh Immersion) సందర్భంగా బందోబస్తు విధుల్లో భాగంగా కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు(Three Town Police Station) చెందిన పోలీస్ కానిస్టేబుళ్లు శివకుమార్ , రాజరత్నం ఆదర్శ్‌నగర్ బోర్డు వద్ద ట్రాఫిక్ మళ్లింపు విధులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో టిఎస్11 ఈఎల్ 8787 నంబర్ గల హ్యుందాయ్ క్రెటా కారు చొప్పదండి వైపు వెళ్తు పోలీస్ సిబ్బంది ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుళ్లు శివకుమార్, రాజరత్నం కిందపడిపోగా, వారి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కారు డ్రైవర్‌ అరవింద్ కు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో  మద్యం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ తిరుమల్ తెలిపారు.గాయపడిన పోలీస్ సిబ్బందిని కరీంనగర్ టౌన్ ఏసిపి వెంకటస్వామి పరామర్శించారు.

మరిన్ని వార్తలు