భారత పార్లమెంట్‌లో ఎస్ఆర్ఆర్ కళాశాల విద్యార్థిని

31-10-2026 | 10:37pm

ముకరంపుర,(విజయక్రాంతి): భారతదేశ ఉక్కుమనిషి, జాతీయ సమైక్యతకు ప్రతీక అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా భారత పార్లమెంట్‌లో నిర్వహించిన ప్రత్యేక  వికసిత్ భారత్ కార్యక్రమం(Viksit Bharat Programme)లో SRR ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(SRR Government Arts and Science College), కరీంనగర్  విద్యార్థిని ఎం. శ్రీనిత్య ప్రసంగించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించే అవకాశం పొందిన ఏకైక వ్యక్తిగా శ్రీనిత్య నిలవడం విశేషం.

భారత పార్లమెంట్(Indian Parliament) వంటి అత్యున్నత ప్రజాస్వామ్య వేదికపై తెలంగాణ రాష్ట్రానికి, తన విద్యాసంస్థకు ప్రాతినిధ్యం వహించడం కళాశాలకు ఎంతో గర్వకారణంగా కళాశాల ప్రిన్సిపల్ కొనియాడారు. ఈ అరుదైన విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాళ్లు శ్రీ పి. నితిన్, శ్రీ టి. రాజయ్య, TGCGTA రాష్ట్ర అధ్యక్షులు మరియు NSS అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ డా. కె. సురేందర్ రెడ్డి, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లు బి. ఎలిజబెత్ రాణి, డా. కె. అర్జున్, డా. పి. తిరుపతి, ఎం. వెంకటేశ్వర్లు, జి. రాజేందర్, అధ్యాపకులు ప్రొఫెసర్ టి. శ్రీనివాస్, డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి , M.సత్య ప్రకాష తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది శ్రీనిత్యను ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు