తెలంగాణ లో పండగ పూట పంచాయతీ కార్మికుల పస్తులు

15-10-2026 | 08:17pm

కొత్తపల్లి, అక్టోబర్ 15(విజయక్రాంతి):  తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్(Telangana Grama Panchayat Employees and Workers Union) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో గురువారం రోజున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్.

పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తూ   జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్ కు సెప్టెంబర్ నెల వేతనాలు వెంటనే చెల్లించాలని అలాగే ఆన్లైన్లో పేర్లు నమోదు లేని కార్మికుల వేతనాలు కూడా నెలల తరబడి బకాయి ఉన్నాయని, వీరికి కూడా బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలని,ఈ నెల 15వ తేదీ వచ్చిన, ఇప్పటికి గత నెల పని చేసిన జీతం వేతనాలు

అందక కనీస అవసరాలకు పండుగ పూట ఖర్చులకు లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇచ్చే ₹9,500 అతి తక్కువ వేతనం కూడా సమయానికి చెల్లించక కార్మికుల కుటుంబాలలో  మానసిక ఆందోళనకు గురవుతూ, నేలంత పనిచేసిన  జీతాలు అందకపోవడం బాధాకరమన్నారు.

పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం చెప్పేది ఒక మాట ఆచరణలో అమల అయ్యేది ఇంకొక మాటలా ఉంది స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన మాట కూడా విలువ లేకుండా కార్మికులకు ఒకటో తారీకు వేతనాలు చెల్లించాలని, క్యాబినెట్లో చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం క్షేత్రస్థాయిలో నెలలు గడిచిన జీతాలు అందడం లేదని ఆరోపించారు.

కొన్ని గ్రామపంచాయతీలలో నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి నుండి చెల్లించకూడదు అనే నిబంధనలు పెట్టి, అవ్వ పెట్టదు  అడుక్కొనివ్వదు అన్నట్లుగా  ప్రభుత్వమే వేతనాలు పై నుండి వేయడం లేదని కార్యదర్శులు ఎంపీడీవోలు, అంటున్నారని, సద్దుల బతుకమ్మ దసరా పండుగ ఏర్పాట్లు మాత్రం కార్మికులను 12 గంటలు 15 గంటలు పనులు చేయించుకుంటున్నారని,

పనులు చేయించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి అధికారులకు వేతనాలు చెల్లించడంలో మాత్రం లేదని, అవసరమైతే కార్మికులందరిని కలుపుకొనిడిపిఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కాశిపాక శంకర్, కమిటీ సభ్యులు అలిశెట్టి రామానుజన్, వడ్లూరి లక్ష్మీనారాయణ, కాడ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు