రాజకీయ సందడి.. కాంగ్రెస్‌లోకి 15 కుటుంబాల చేరిక!
ఖమ్మం రూరల్, (విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు (Development and Welfare Programs) ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు (Political Joinings) కొనసాగుతున్నాయి. దారేడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్, సీపీఐ పార్టీలకు చెందిన 15 కుటుంబాల వారు శనివారం మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు ఏనుగు రామిరెడ్డి, చల్లా హనుమంతరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి తుంబూరు దయాకర్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో చేరిన వారందరికీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు ఏనుగు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.