ఎంపీ పదవి నుంచి ఎందుకు బహిష్కరించలేదు?
- బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి
- కాంగ్రెస్ ఎంపీ లైంగిక వేధింపులకు నిరసనగా గాంధీభవన్ ముట్టడి
హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ‘స్మాష్ ది పేట్రియార్కీ’(Smash the patriarchy), మహిళా సాధికారత అంటూ కల్లబొల్లి నీతులు వల్లించే రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం మరోసారి బట్టబయలైందని బీజేపీ రాష్ట్ర మహిళా మో ర్చా అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)(Jawaharlal Nehru University) ప్రొఫెసర్, కాంగ్రెస్ ఎంపీ లైంగిక వేధింపులకు ని రసనగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపు లో తీసుకున్నారు.
శిల్పారెడ్డి మాట్లాడు తూ...ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జేఎన్‌యూలో 11 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు తేలడంతో ప్రొఫెసర్, ఆ పార్టీకి చెం దిన ఇన్నర్ మణిపూర్ ఎంపీ డాక్టర్ అంగోమ్‌చా బిమోల్ అకోయిజంను జేఎన్‌యూ సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారని గుర్తుచేశారు. దాదాపు నాలుగు నెలల క్రితం బాధితులు ఫిర్యాదు చేసి, ఇంటర్న ల్ కమిటీ విచారణ లో లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువై జేఎన్‌యూ కఠిన చర్యలు తీసుకుంటే,
కాంగ్రెస్ మాత్రం ఆ ఎంపీపై ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీ వీ ధుల్లో నిరసనల పేరుతో స్వయంగా మహిళా పోలీసులపై చేయి చేసుకునే సంస్కృతి ఉన్న రాహుల్ గాంధీకి మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హతే లేదని శిల్పారెడ్డి మండిపడ్డారు.
ఆ ఎంపీపై కేవలం వేటు ప డటం సరిపోదని, అతన్ని తక్షణమే పార్లమెంట్ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయనపై తక్షణమే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే స్త్రీ గౌరవానికి తావులేదని, ఇలాంటి వరుస ఘటనలు ఆ పార్టీ అసలు నైజాన్ని నిరూపిస్తున్నాయని హెచ్చరించారు.