కార్మికుల తీర్పు కూటమికే

10-10-2026 | 10:43am

సత్తుపల్లి, అక్టోబర్ 9 (విజయ క్రాంతి): ఈరోజు జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా, ఖమ్మం జిల్లా రీజియన్ పరిధిలో ఎంప్లాయీస్ యూనియన్ కూటమి గెలుపు ఖాయమైందని కూటమి నాయకులు తెలిపారు. కూటమికి ఓట్లు వేసిన ఆర్టీసీ కార్మిక సోదర సోదరీమణులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఓటు వేసే విధానాన్ని వివరిస్తూ స్లిప్పులను పంపిణీ చేశారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కార్మికులు శాంతియుత వాతావరణంలో ఓటింగ్‌లో (Voting) పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని నాయకులు తెలిపారు. ఓటింగ్‌లో పాల్గొన్న కార్మికులందరికీ మరోసారి అభినందనలు తెలియజేశారు. రానున్న కాలంలో కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం, ఆర్టీసీ పరిరక్షణ కోసం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం కార్మికులను కలుపుకొని సంఘటితంగా పోరాడుతామని కూటమి యూనియన్ నాయకులు జి. బాలస్వామి, ఎన్.ఆర్. కృష్ణ, రాంబాబు (Employees Union), వై. నాగరాజు (TMU) తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, ఎన్‌ఎంయూ, ఈయూ, టీఎంయూ నాయకులు దండు ఆదినారాయణ, నిమ్మటూరు రామకృష్ణ, తడికమళ్ల యోబు, సముద్రాల సుధాకర్, జి. బాలసుబ్రమణ్యం, రాంబాబు, కాంతారావు, రాజు, కృష్ణ, రఘురాం, తిరుపతయ్య, వరలక్ష్మి, జానకి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు