‘ప్రాణా న్యాచురల్స్’స్టోర్‎ను ప్రారంభించిన తాతా మధు, సండ్ర

13-09-2026 | 04:23pm

(ఖమ్మం,విజయక్రాంతి): ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రకృతిసిద్ధమైన ఆహారోత్పత్తులు ఎంతో అవసరమని ఎమ్మెల్సీ తాతా(MLCs grandfather) మధుసూదన్, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం బైపాస్ రోడ్డు, రాపర్తి నగర్ (హెచ్‌పీ పెట్రోల్ పంపు ఎదురుగా) నూతనంగా ఏర్పాటు చేసిన ‘ప్రాణా న్యాచురల్స్’ స్టోర్‌ను ఆదివారం ఉదయం వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్ నిర్వాహకులు కోలేటి ప్రవీణ్, నవీన్‌లను అతిథులు అభినందిస్తూ, ప్రజలకు నాణ్యమైన సహజసిద్ధ ఉత్పత్తులను అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. 

ఈ కార్యక్రమంలో నాయకులు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, బత్తుల మురళి, భాషబోయిన వీరన్న, ముత్యాల వెంకటప్పారావు, బలుసు మురళీకృష్ణ, బంక మల్లయ్య, చామకూరి రాజుతో పాటు పలువురు స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.



మరిన్ని వార్తలు