కాంగ్రెస్‌ను వీడను.. ప్రచారానికి కొండా చెక్!

13-09-2026 | 05:07pm

వరంగల్: కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ(Konda Surekha) తెరదించారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు నిరాధారమని కొట్టిపారేశారు. ఆదివారం భర్త కొండా మురళితో కలిసి కార్యకర్తలు, మద్దతుదారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాము కాంగ్రెస్‌లోనే పుట్టి, పెరిగామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

భవిష్యత్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పైనే పోటీ చేస్తామని తెలిపారు. మంత్రి పదవి కోల్పోవడంపై వ్యక్తిగతంగా బాధ లేదని, అయితే తొలగింపునకు కారణం చెప్పకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. తనకు అధిష్ఠానం నుంచి ఫోన్లు వచ్చాయని, పార్టీ వీడేది లేదని స్పష్టం చేసినట్లు చెప్పారు. త్వరలో తన భర్త కొండా మురళికి పదవి ఇస్తామనే సంకేతాలు వచ్చాయని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి గెలిచి మళ్లీ మంత్రిగా వస్తానని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు