పదవి కోసం తగ్గేదే లేదు.. సారీకి నో చెప్పిన సురేఖ!
13-09-2026 | 03:18pm
హనుమకొండ: మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఆమె భర్త కొండా మురళి(Konda Murali) కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి కాగితంపై ‘సారీ’ అని రాసి ఇస్తే మంత్రి పదవి కొనసాగుతుందని సురేఖకు సూచించినట్లు తెలిపారు. అయితే తన పదవి పోయినా సరే తాను సారీ చెప్పనని కొండా సురేఖ తెగేసి చెప్పారని మురళి వెల్లడించారు.
పదవి కంటే ఆత్మగౌరవమే ముఖ్యమని సురేఖ భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేందుకు ఆమె సిద్ధంగా లేరని చెప్పారు. సురేఖకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటారని కొండా మురళి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.