గిరిజన రైతు భూమి రిజిస్ట్రేషన్‌కు ఆటంకాలెందుకు?

23-10-2026 | 06:59pm

 రూ.2 లక్షలు డిమాండ్‌ చేశారంటూ సర్పంచ్‌పై ఆరోపణలు..

ఖండించిన సర్పంచ్‌, తహశీల్దార్‌

తిరుమలాయపాలెం, అక్టోబర్‌ 23 (విజయ్క్రాంతి) : తిరుమలాయపాలెం మండలంలోని(Thirumalayapalem Mandal) హైదర్‌సాయిపేటకు చెందిన గిరిజన రైతు గూగులోత్‌ రాంబాబు(Tribal farmer Guguloth Rambabu) తన కుమార్తె వివాహం సందర్భంగా తనకున్న 5 ఎకరాల 6 కుంటల భూమిని గిఫ్ట్‌ డీడ్‌(Gift Deed) ద్వారా కుమార్తెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. భూమికి సంబంధించిన పాత పట్టాలు, రెవెన్యూ రికార్డులు(Revenue Records), కోర్టు డిక్రీలు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్‌ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రిజిస్ట్రేషన్‌ సమస్య పరిష్కారానికి సర్పంచ్‌ సిమ్లా నాయక్‌ రూ.2 లక్షలు డిమాండ్‌ చేశారని రాంబాబు ఆరోపించగా, సర్పంచ్‌ ఆ ఆరోపణలను ఖండించారు. భూమిపై ఫిర్యాదులు, కోర్టు వివాదాలు ఉన్నందునే రిజిస్ట్రేషన్‌ నిలిపివేశామని తహశీల్దార్‌ లూథర్‌ విల్సన్‌ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి భూమి రికార్డులు, కోర్టు ఉత్తర్వులపై సమగ్ర విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని రాంబాబు కోరారు.

మరిన్ని వార్తలు