50వ డివిజన్ లో అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించిన యువనేత డాక్టర్ తుమ్మల యుగంధర్
20-09-2026 | 04:52pm
ఖమ్మం, విజయక్రాంతి: ఖమ్మం కార్పొరేషన్(Khammam Corporation) పరిధిలోని 50వ డివిజన్ లో శ్రీ గణేష్ ఉత్సవకమిటీ,రాపర్తినగర్ వారు ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద ఆదివారం యువనేత డాక్టర్ తుమ్మల యుగంధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం కమిటీ వారు ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని నగర మాజీ మేయర్ పునకొల్లు నీరజ, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబాతో కలిసి ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు నార్నె వెంకటప్రసాద్, షైన్ ఇండియా స్కూల్ చైర్మన్ తాళ్లూరి సృజన్ కుమార్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..