నిజాం ఆస్తుల కన్నా.. కేసీఆర్ ఆస్తులే ఎక్కువ!

20-09-2026 | 02:00pm

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) మొయినాబాద్, అజీజ్ నగర్(Aziz Nagar)లో FTLలో కట్టిన ఫామ్ హౌస్ ను అధికారులతో కాంగ్రెస్ ఎంపీలు(Congress MPs), ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసి పరిశీలించారు. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్(Chevella DCP Yogesh Gautam) అజీజ్ నగర్ లో శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Congress MP Chamala Kiran Kumar Reddy) మాట్లాడుతూ... ప్రజల వాస్తవాలు తెలియాలనే భూములు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిజాం ఆస్తుల కంటే కేసీఆర్ కుటుంబ ఆస్తులు(KCR's family assets) ఎక్కువ అన్నారు. ఈ ఆస్తులన్నీ మీ తాతల నుంచి వచ్చాయా?, కేటీఆర్ 2009లో లేని ఆస్తులు ఇప్పుడు ఎలా వచ్చాయి?, ఉద్యమ సమయంలో లేని ఫామ్ హౌస్ హరీశ్ రావు(Harish Rao)కు ఇప్పుడు ఎలా వచ్చింది?, కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కన ఉన్న 300 ఎకరాల అసైన్డ్ భూములను దళితులకు ఎందుకు పంచలేదు? అని ఎంపీ చామల వరస ప్రశ్నలు సంధించారు.

300 ఎకరాల భూమిని కబ్జా చేయాలని కేసీఆర్ చూశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీకున్న ఆస్తులు అఫిడవిట్ లో ఎందుకు లేవన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని విమర్శించారు. 76 సర్వే నంబర్ లోని ఫామ్ హౌస్ ను హరీశ్ రావు కొన్నారు.. ఇన్ని ఆస్తులు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచివచ్చాయని ఎంపీ చామల ప్రశ్నించారు. కాళేశ్వరం(Kaleshwaram Lift Irrigation Project) డబ్బులతోనే ఆస్తులు కొన్నారా? కేసీఆర్ కుటుంబసభ్యుల వద్ద వందల ఎకరాలకు పైగా భూమి ఉందన్నారు. అసైన్డ్ భూములను ఎలా కొంటారన్న చామల ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ సీఎంకు ఇన్ని ఫామ్ హౌస్ లు లేవన్నారు. మీ ఆస్తులపై తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.






మరిన్ని వార్తలు