అహ్మద్ నక్షబందీ ప్రవచన పోస్టర్ల ఆవిష్కరణ

13-10-2026 | 03:05pm

ఆసిఫాబాద్(విజయ క్రాంతి):  పట్టణంలోని జామా మసీదు వద్ద బుధవారం మతబోధకులు అహ్మద్ నక్షబందీ ప్రవచన(Ahmed Naqshbandi's discourses) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గౌసుల్ వరా కమిటీ సభ్యులు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు హాజరుకావాలని కమిటీ సభ్యులు కోరారు.

కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించడంతో పాటు మతబోధకులు అహ్మద్ నక్షబందీ ప్రవచనాలను విని ఆధ్యాత్మిక సందేశాలను పొందాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు