ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రెక్టర్లు, ఆయాలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి

25-11-2026 | 06:45pm

ఆసిఫాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌స్ట్రెక్టర్లు, ఆయాలకు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్(AITUC District Secretary Boge Upender) డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానంద చారికి యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత, ఐడీ కార్డులు, 12 నెలల వేతనం, ప్రసూతి సెలవులు కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AITUC జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎ.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు