లక్కీ డ్రా ద్వారా బార్ కేటాయింపు

16-10-2026 | 07:13pm

207 దరఖాస్తుల్లో మల్లు రమేష్ గౌడ్‌కు అవకాశం

ఆసిఫాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన బార్ అండ్ రెస్టారెంట్‌ను లక్కీ డ్రా పద్ధతిలో కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో ఆదిలాబాద్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డితో కలిసి కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు.ఈ బార్ కోసం ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 207 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.

దరఖాస్తుదారుల సమక్షంలో నిర్వహించిన లక్కీ డ్రాలో 102వ నంబరు దరఖాస్తుదారుడైన మల్లు రమేష్ గౌడ్ ఎంపికైనట్లు వెల్లడించారు. బార్ నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆబ్కారీ, మధ్య నిషేధ శాఖ అధికారి లక్ష్మీనాయక్, సంబంధిత అధికారులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు