డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

08-10-2026 | 07:55pm

కాగజ్‌నగర్(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Government Degree College)లో ఎన్‌ఎస్‌ఎస్, మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను(Bathukamma Festival Celebrates) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె. శ్రీదేవి మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న బతుకమ్మ పండుగ సంప్రదాయాలు తెలంగాణ సంస్కృతి(Telangana cultural)లో భాగమని, వాటిని గౌరవించి పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

వైస్‌ ప్రిన్సిపాల్ డా. లక్ష్మీ నరసింహం బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని వివరించారు. కళాశాల కోఆర్డినేటర్ దుర్గం జనార్దన్ బతుకమ్మ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తూడూరు దత్తాత్రేయ, మహిళా సాధికారత విభాగం ఇన్‌చార్జి రోస్ మేరీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు