ఎల్ నినో ప్రభావంతో ఎండిన పంటలు
బెజ్జూర్ అక్టోబర్ 26 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలో ఎల్ నినో(El Nino) ప్రభావంతో వరి,పత్తి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో నీరు పంటలకు అందకపోవడంతో వరి పంట ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి నాగరాజు సూచనల మేరకు ఏ ఈ ఒ శివకుమార్ ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు.
ఎండిపోయిన వరి పంటల వివరాలను, రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో సాగుకు నీరు లేనందున రెండవ పంటగా వరి పంట సాగు చేయవద్దని సూచించారు. రైతులు సాగు చేసుకునే పంటల వివరాలను రైతులకు సూచించారు. వారి వెంట నాయకులు అమీరుద్దీన్, వార్డ్ మెంబర్ గుమ్మల శ్రీనివాస్ రైతులు వున్నారు.