పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయండి
బానోత్ కిషన్ నాయక్
ఆసిఫాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలోని(Adilabad District) పోరాటాల పురిటిగడ్డ ఇంద్రవెల్లిలో(Indravelly) ఈ నెల 30న టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత(TRS party chief Kalvakuntla Kavitha) ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆసిఫాబాద్ ఇన్చార్జి బానోత్ కిషన్ నాయక్ పిలుపునిచ్చారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కిరిమిల్ల వినోద్తో కలిసి ఆయన మాట్లాడారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైద్యం, విద్య, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో ఆశించిన అభివృద్ధికి దూరంగా ఉందని అన్నారు. జిల్లా ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే కవిత ఈ సభను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు దేవల్ల వీరన్న, సంజీవ్, సిర్పూర్ కాగజ్నగర్ పార్టీ అభ్యర్థి కవేటి సబిత, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మనోహర్, కోశాధికారి మోసీన్, ఆదివాసీ జిల్లా అధ్యక్షుడు కిషన్, జాయింట్ సెక్రటరీ సాయి, పెందూర్ ధర్ము, అబ్బు తాలిబ్ తదితరులు పాల్గొన్నారు.