కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

27-09-2026 | 04:34pm

బెజ్జూర్ సెప్టెంబర్ 27,(విజయ క్రాంతి): బెజ్జూరు మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ నేత స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పద్మశాలి సేవా సంఘం(Padmashali Seva Sangham) ఆధ్వర్యంలో  ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సామల తిరుపతి మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి(Wankidi)లో 1915 సెప్టెంబర్ 27న జన్మించడం జరిగిందన్నారు.ఎమ్మెల్యేగా,మంత్రిగా సేవలందించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం చేశారన్నారు.

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం జరిగిందన్నారు. 2012 సెప్టెంబర్ 21న హైదరాబాదులో మరణించడం జరిగిందని ఆయన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సామల తిరుపతి ,ప్రధాన కార్యదర్శి కనుకుట్ల వెంకటేష్, కార్యవర్గ సభ్యులు కనుకుట్ల  శ్రీనివాస్,పరుస గణేష్,పర్స రమేష్ ,అవధూత ఓం ప్రకాష్, భోగ విలాస్ ,శ్రీరామ భాస్కర్, అభిమానులు జిల్లాల సుధాకర్ గౌడ్,గడ్డం శ్రీనివాస్,పేదం విట్టయ్య,బెణికి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు