రైల్లో వైద్య సేవలను వినియోగించుకోవాలి

16-10-2026 | 06:57pm

సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు

కాగజ్‌నగర్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): పేద ప్రజల కోసం లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు(Sirpur MLA Dr. Palvai Harish Babu) కోరారు. శుక్రవారం కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో జిల్లా కలెక్టర్ కె.హరితతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.

అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు నిర్వహించే ఈ శిబిరంలో ఎముకలు, కంటి, చెవి, ప్లాస్టిక్ సర్జరీతో పాటు మహిళలకు సంబంధించిన వ్యాధులకు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ హర్ష చౌదరి, డీఎంహెచ్‌ఓ నాగేందర్, ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ రోహిణి చిగులే, తహసీల్దార్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు