పైప్ లైన్ లీకేజ్

22-10-2026 | 07:54pm

అభివృద్ధి అధికారి కార్యాలయం ముందు బురద

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూరు మండల(Bejjur Mandal) కేంద్రంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయం సమీపంలో పైప్లైన్ లీకేజీ తో కార్యాలయం ముందు బురద మయంగా మారింది. కొన్ని రోజులుగా మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ(Mission Bhagiratha pipeline leakage) కార్యాలయం ముందు ఉన్న పైపులకు ట్యాప్స్ లేకపోవడంతో  కార్యాలయం ముందు మిషన్ భగీరథ నీరు చేరడంతో కార్యాలయానికి వచ్చే వాహనాలతో కార్యాలయం ముందు బురదమయంగా  మారింది. దీనితో ప్రతినిత్యం వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు, కార్యాలయ సిబ్బంది ఇబ్బంది పడుతున్నామని తెలుపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైపులైనుకు మరమ్మత్తులు చేసి త్రాగునీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని కార్యాలయానికి వచ్చే ప్రజలు తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలు