కృష్ణపల్లిలో సెల్ సిగ్నల్ కష్టాలు
16-09-2026 | 06:44pm
బెజ్జూర్ సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలం కృష్ణపల్లి గ్రామంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ అందడం లేదని స్థానిక యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్వో రామ్మోహన్ రావు(MRO Rammohan Rao), ఎంపీడీవో ప్రవీణ్ లకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో 500 కుటుంబాలు ఉన్నాయని, మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామంలో సెల్ టవర్ లేకపోవడంతో సిగ్నల్ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. అత్యవసర సమయంలో కమ్యూనికేషన్ కష్టంగా మారిందన్నారు. స్పందించిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదికా అందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.