విద్యుత్‌ కోసం బీఆర్‌ఎస్‌ మహాధర్నా

16-09-2026 | 06:49pm

మహమ్మదాబాద్/గండీడ్‌: రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సల్కర్‌పేట్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట మంగళవారం మహాధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి(Former MLA Koppula Mahesh Reddy) అధ్యక్షతన జరిగిన ఈ ఆందోళనలో రైతులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ కోతలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్‌ అందించామని, ప్రస్తుతం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విద్యుత్‌ సరఫరా సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు నిరంతర విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు.

ధర్నా అనంతరం విద్యుత్‌ శాఖ ఏఈ శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు. సబ్‌స్టేషన్‌లోని ఇన్‌కమింగ్‌, అవుట్‌గోయింగ్‌ రిజిస్టర్లను పరిశీలించి సరఫరా పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంట్యా నాయక్‌, దిడ్డికాడి గోపాల్‌, మాజీ జెడ్పీటీసీ ఎం. శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు