పైలట్ స్మిత్ ధైర్యానికి సెల్యూట్
06-10-2026 | 02:53pm
ఆసిఫాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Pilot Smith Matchers Bravery)ధైర్యసాహసాలకు దేశం గర్విస్తోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్ అన్నారు. స్మిత్ సమయస్ఫూర్తి, తక్షణ స్పందన ఎంతోమంది ప్రాణాలను కాపాడిందని కొనియాడారు. గాయపడినప్పటికీ ఇతరులను రక్షించాలనే ఆయన సంకల్పం ప్రశంసనీయమన్నారు. కెప్టెన్ స్మిత్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.