పారిశుద్ధ్య కార్మికులకు నూతన దుస్తులు పంపిణీ
బెజ్జూర్ అక్టోబర్ 19 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల(Sanitation Workers)కు సర్పంచ్ దుర్గం సరోజ, ఉప సర్పంచ్ ఆదర్శ్ ఆధ్వర్యంలో నూతన దుస్తులు పంపిణీ చేశారు. దసరా పండుగను పురస్కరించుకొని 9 మంది పారిశుద్ధ్య కార్మికులకు నూతన దుస్తులను పాలకవర్గం చేతుల మీదుగా గ్రామ పంచాయతీ తరపున పంపిణీ చేసినట్లు తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులను నూతన దుస్తులు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వైకుంఠం,వార్డు సభ్యులు సామల తిరుపతి, గుమ్మల శ్రీనివాస్, కోట రాజన్న, నాయకులు అమీరుద్దీన్, నరేందర్ గౌడ్, దుర్గం తిరుపతి, రంగు సురేష్ గౌడ్, జంగిటి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.