రామాలయంలో దుర్గామాత పూజలు

19-10-2026 | 08:56pm

 కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా!!

శివంపేట(విజయక్రాంతి): శివంపేట మండలంలో దుర్గమ్మ అమ్మవారి పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పులిమామిడి నవీన్ గుప్తా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దుర్గమ్మ అమ్మవారి పూజా కార్యక్రమాల నిర్వహణకు తనవంతు సహకారంగా రూ.21 వేలు విరాళాన్ని అందజేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పండుగలు, పూజా కార్యక్రమాల సమయంలో ప్రజలతో కలిసి పాల్గొనడం, ఆలయాల అభివృద్ధికి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. దుర్గమ్మ అమ్మవారి కృపతో ప్రజలందరికీ మంచి జరగాలని, గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నవీన్ గుప్తా అందించిన రూ.21 వేలు విరాళం పూజా కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడనుంది. ఈ పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు, శివంపేట్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు, దుర్గామాత కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి పూజల్లో భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

మరిన్ని వార్తలు