తల్లిదండ్రుల జ్ఞాపకార్థం.. విద్యార్థులకు ఉపకార వేతనాలు
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సునీత శ్రీనివాస్ దంపతులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రాంప్రసాద్ తెలిపారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున అందించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందించేందుకే ఈ ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు.
'నాగరాజు & లక్ష్మి నాచరమ్మ స్మారక ఉపకార వేతనాలు' (స్కాలర్‌షిప్‌లు)
హైదరాబాద్‌కు చెందిన డి. సునీత శ్రీనివాస్ దంపతులు,తమ తల్లిదండ్రులైన నాగరాజు మరియు లక్ష్మి నాచరమ్మల జ్ఞాపకార్థం,2026-27 విద్యా సంవత్సరం నుండి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మరియు పదవ తరగతి (SSC) ప్రభుత్వ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులకు, ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున,మొత్తం రూ. 12,000 ఉపకార వేతనంగా అందజేయబడుతుంది.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయపడాలనే ఉద్దేశంతో ఈ ఉపకార వేతనాలను ప్రకటించారనీ,కళాశాల ప్రిన్సిపాల్ రాంప్రసాద్ తెలిపారు.ఈ ఉపకార వేతనాలు విద్యార్థులలో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందిస్తాయి విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.