బతుకమ్మ ఆడిన జడ్జి ఎస్పి

19-10-2026 | 09:05pm

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) నిర్వహించారు. రంగురంగుల బతుకమ్మలకు జిల్లా జడ్జి శ్రీవాణి(District Judge Srivani), ఎస్పీ జానకి షర్మిల పూజలు నిర్వహించి పోలీస్ మహిళలతో కలిసి బతుకమ్మ కోలాటం చేస్తూ నృత్యాలు చేశారు. బతుకమ్మ వేడుకలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి సాయికిరణ్ ఉపేందర్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు