జిల్లా కాంగ్రెస్ మైనార్టీ జనరల్ సెక్రటరీగా షేక్ కలీం

09-10-2026 | 12:17pm

ఆసిఫాబాద్(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ(Congress Party) మైనార్టీ విభాగం జిల్లా జనరల్ సెక్రటరీగా షేక్ కలీం నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ(DCC President Athram Suguna), నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, జిల్లా మైనార్టీ చైర్మన్ అర్షద్ హుస్సేన్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, మైనార్టీల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు