పిడుగుపాటుతో రెండు పాడి గేదెలు మృతి
13-09-2026 | 09:59am
ప్రభుత్వ అధికారులు సాయం చేయాలని బానోత్ సీతారాం ఆవేదన
తుంగతుర్తి, (విజయక్రాంతి): తుంగతుర్తి మండల పరిధిలోని ఏనేకుంట తండాలో పిడుగుపాటుతో రెండు పాడి గేదెలు(buffaloes) మృతి చెందిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఏనెకుంటతండాకి చెందిన బానోతు సీతారాం పాడి గేదెలను తన వ్యవసాయ బావి వద్ద కట్టేసి ఉంచగా రాత్రి కురిసిన వర్షానికి పిడుగులు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాయని, సుమారు రెండు గేదెలకు రూ1.50 లక్షల విలువ ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు సీతారాం కోరారు. శనివారం రాత్రి రెండు గంటలకు పైగా వర్షం పడడంతో గ్రామాల్లోని కుంటలు, చెరువులోకి నీళ్లు రావడం జరిగింది.