దసరా సెలెవులు కాగానే పిల్లలకు బడికి పంపాలని గ్రామస్థులు తీర్మానం

11-10-2026 | 08:18pm

సిర్పూర్ -యు (విజయక్రాంతి )అక్టోబర్ 11: విద్య ఉంటేనే పిల్లల భవిష్యత్ ఉంటుందని సిర్పూర్ -యు గ్రామ పట్టేల్ ఆత్రం ఆనందరావు(Sirpur-U Village Patel Atram Anandrao) అన్నారు. ఆదివారం మండల కేంద్రమైనా సిర్పూర్ యు గ్రామంలో తన ఆధ్వర్యంలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించి దసరా సెలవులలో(Dasara holiday) వచ్చిన పిల్లలకు తమ తల్లితండ్రులు సెలవులు కాగానే బడికి పంపపాలని గ్రామస్థులతో తీర్మానం చేశారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం ఉట్నూర్ ఐటిడిఏ లో ఉమ్మడి జిల్లా గొండ్వాన రాయిసెంటర్ సర్మేడిలు, జిల్లా సర్మేడిలు, సమాజ పెద్దలతో ప్రాజెక్టు అధికారి మంద మకరందు సమావేశం నిర్వహించి గిరిజన ప్రాంత పిల్లలు దసరా సెలవులకు వెళ్లి దీపావళి వరకు ఇంట్లోనే ఉంటారని సెలవులు కాగానే త్వరగా తమ పిల్లలకు బడికి పంపాలని గిరిజన ప్రాంతం అభివృద్ధి చెండాలంటే ముందుగా విద్య వికాసనికి అందరు సహకరించలన్నారని అయన తెలిపారు. తమ గ్రామ బడి పిల్లలకు సెలవులు కాగానే బడికి పంపిస్తామని గ్రామస్తులు తీర్మానం నుంచేసినట్లు అయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు