పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

11-10-2026 | 08:30pm

ధర్మపురి,అక్టోబర్11 (విజయక్రాంతి): వెల్గటూర్ మండల(Velgatur Mandal) కేంద్రంలోని వాసవి ఉన్నత పాఠశాలలో 2007-08 బ్యాచ్ లో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని(Alumni Meet) ఘనంగా నిర్వహించారు. సుమారు 18 సంవత్సరాల తర్వాత తమ సహచర మిత్రులందరూ ఒకే వేదికపై కలుసుకోవడంతో పాఠశాల ప్రాంగణం కోలాహలంగా మారింది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ  తమ బాల్య జ్ఞాపకాలను, పాఠశాలలో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. తాము ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భూమయ్య, పురుషోత్తం, అండాలు, లచ్చయ్య మరియు 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అశోక్, సురేష్, నరేష్, కోటి, ప్రసాద్, నగేష్, సంతోష్, అవినాష్ ,రవి ,నాగరాజు, రాజేంద్రప్రసాద్, మహేష్, నవనీత రావు, అన్వేష, మౌనిక, సౌమ్య, సౌజన్య, సుజాత ,సంధ్య ,సరిత, సింధూర, తిరుమల పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు