కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనంతోనే కౌలు రైతుకు భారీ నష్టం
- బీజేపీ పాలేరు ఇంచార్జి నున్నా రవికుమార్ తీవ్ర ఆగ్రహం
- విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో కాలిపోయిన 4 ఎకరాల చెరుకు తోట – రూ. 6 లక్షల నష్టం
- బాధిత రైతు బానోతు రవిని పరామర్శించిన బీజేపీ నాయకులు
- ఎకరానికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్
కూసుమంచి, అక్టోబర్ 11 విజయక్రాంతి: ఒకవైపు విద్యుత్ శాఖ అధికారుల(Electricity Department officials) తీవ్ర నిర్లక్ష్యం, మరోవైపు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఘోరంగా విఫలం కావడం వల్లే చేతికి వచ్చిన పంట కాలిపోయి కౌలు రైతు రోడ్డున పడ్డాడని బీజేపీ పాలేరు అసెంబ్లీ ఇంచార్జి నున్నా రవికుమార్(Nunna Ravikumar) మండిపడ్డారు. గోరిలపాడు తండాకు చెందిన కౌలు రైతు బానోతు రవికి చెందిన గట్టి సింగారం లో చెరుకు తోట 4 ఎకరాల చెరుకు తోట(Sugarcane field) విద్యుత్ ప్రమాదం కారణంగా పూర్తిగా అగ్నికి ఆహుతైంది.
ఈ ప్రమాదంలో సుమారు రూ. 8 లక్షల మేర పంట నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న నున్నా రవికుమార్ బీజేపీ నాయకులతో కలిసి కాలిపోయిన చెరుకు తోటను ప్రత్యక్షంగా సందర్శించి, బాధితుడిని పరామర్శించి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నున్నా రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన’ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు రైతులకు తీరని నష్టం జరుగుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి, బాధితుడికి ఎకరానికి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రికి పరామర్శించే సమయం లేదా?:
శాసనసభ్యుల (ఎమ్మెల్యే) క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఇంత భారీ అగ్నిప్రమాదం జరిగి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నప్పటికీ కనీసం బాధిత రైతును పరామర్శించి ధైర్యం చెప్పడానికి కూడా ఆయనకు సమయం లేకపోవడం విచారకరమని జిల్లా మాజీ కార్యదర్శి హట్యా నాయక్ విమర్శించారు.
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడం సిగ్గుచేటు:
‘ప్రజా ప్రభుత్వం’ అని డబ్బాలు కొట్టుకోవడం తప్ప, దేశానికి అన్నం పెట్టే రైతు కుటుంబం నడిరోడ్డున పడి అల్లాడుతుంటే ఆదుకోలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికే సిగ్గుచేటని జిల్లా ఉపాధ్యక్షుడు రవి రాథోడ్ ధ్వజమెత్తారు. సంబంధిత అధికారులు తక్షణమే ఘటనా స్థలాన్ని పరిశీలించి, నష్ట తీవ్రతను అంచనా వేసి బాధిత కౌలు రైతుకు రూ. 8 లక్షల పరిహారాన్ని చెల్లించి పూర్తిస్థాయిలో ఆదుకోవాలని ఈ సందర్భంగా బిజెపి నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ నాయక్, నితిన్, వంశీ, గబ్బర్ సింగ్ తదితర నాయకులు పాల్గొన్నారు.