గోవిందరావుపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బత్తిని వెంకట్

11-10-2026 | 08:36pm

గోవిందరావుపేట, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : ములుగు జిల్లా(Mulugu District) గోవిందరావుపేట (లక్నవరం) ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా బత్తిని వెంకట్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం గోవిందరావుపేట రైతు వేదికలో(Govindaraopet Rythu Vedika) జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బత్తిని వెంకట్(సాక్షి ), ప్రధాన కార్యదర్శిగా సామ బుచ్చిరెడ్డి ( నవతెలంగాణ) ఉపాధ్యక్షుడిగా పగడాల వాసురెడ్డి (ఆంధ్రప్రభ ) , కోశాధికారిగా తుక్కాని ఎల్లారెడ్డి (మన తెలంగాణ), సంయుక్త కార్యదర్శిగా కళ్లెం రవీందర్ రెడ్డి (వార్త ) ఎన్నికయ్యారు.

ఎన్నికల పరిశీలకులుగా ఆకుల యుగేందర్ (ఈనాడు), నెక్కంటి సునీల్ (ఆంధ్రజ్యోతి) వ్యవహరించారు. సమావేశంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బత్తిని వెంకట్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు.

సభ్యుల సహకారంతో ప్రెస్ క్లబ్ అభివృద్ధికి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడెం సారంగపాణి (నమస్తే తెలంగాణ), నర్ర రఘువీర్ (టీవీ 9), జన్నారపు రమేష్ (6టీవీ ), సతీష్ (టీవీ 5), మొగులూరి సంపత్ (ప్రజా దర్బార్), పగడాల శ్రీకాంత్ (ప్రజాపక్షం ), మచ్చ వెంకటేశ్వర్లు (విజయక్రాంతి), గొల్లపెల్లి శ్రీకాంత్ (ప్రజావాణి), చాందు పాషా( జనం సాక్షి), యోగి ( పీపుల్స్ డైరీ) తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు