మార్కండేయ ఆలయ కమాన్ ప్రారంభోత్సవం

11-10-2026 | 08:41pm

రామంతాపూర్‌లో ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం

ఎంపీ ఈటల, ఎమ్మెల్యే బండారి

ఉప్పల్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): రామంతాపూర్‌లోని ఇందిరానగర్‌లో పద్మశాలి సంఘం(Padmashali Association) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ మార్కండేయ ఆలయ కమాన్‌ను(Sri Markandeya Temple Arch) ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender), ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కమాన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ కమాన్ ప్రారంభంతో ఇందిరానగర్ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ మార్కండేయ స్వామి ఆలయానికి గుర్తింపుగా కమాన్ ఏర్పాటు చేయడం పట్ల పద్మశాలి సంఘం ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు