ఆదర్శ గ్రామ నిర్మాణానికి గ్రామస్తుల సమష్టి కృషి
30 మంది ముఖ్య నాయకులతో సమావేశం
గోవిందరావుపేట, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఆదర్శ గ్రామ నిర్మాణానికి(Construction of a Model Village) గ్రామస్తులు నడుం బిగించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై గ్రామంలోని ముఖ్య నాయకులు, పెద్దలతో సమావేశం నిర్వహించారు. సుమారు 30 మంది పాల్గొన్న ఈ సమావేశంలో గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
గ్రామంలో రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు(Roads, sanitation, and drinking water) తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ప్రజలందరి భాగస్వామ్యంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. గ్రామంలో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ, సమస్యలను సమష్టిగా పరిష్కరించుకోవాలని నాయకులు అభిప్రాయపడ్డారు.
గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ఐక్యతతో ముందుకు సాగితేనే ఆశించిన లక్ష్యాలను సాధించగలమని సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామ్మోహన్, ఉప సర్పంచ్ సుధీర్, ఆదర్శ గ్రామ నిర్మాణ పథకం మేనేజర్ మంజుల, ప్రతినిధి వినయ్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.