అటవీ శాఖ అధికారులపైన ఆదివాసీ కన్నెర

15-10-2026 | 08:20pm

సిర్పూర్ యు, లో రెండు గంటల పాటు రాస్తారోకో

ఆదివాసులు అభివృద్ధికి అటవీ శాఖ అడ్డు రావద్దు అని డిమాండ్

సిర్పూర్ యు,(విజయక్రాంతి): ఏజెన్సీ ఆదివాసీ గ్రామాలలో అటవీ శాఖ(Forest Department) అధికారుల పెత్తనం  అధికం కాకూడదనే డిమాండ్ తో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జాతీయ అధ్యక్షులు కొట్నాక్ విజయ్(National President Kotnak Vijay) ఆధ్వర్యంలో అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారి పై సుమారు రెండు గంటల పాటు వందలాది మంది తో రాస్తారోకో నిర్వహించారు. అంతకు ముందు మండల కేంద్రంలో గల ఆదివాసీ పోరాట యోధుడు కుంరం భీమ్(Tribal freedom fighter Kumram Bheem) విగ్రహానికి పూలమాలలు వేసి అటవీ శాఖ కార్యాలయం వరకు సుమారు కిలో మీటర్ వరకు డోలు వాయిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్బంగా కొట్నాక్ విజయ్ మాట్లాడుతూ సిర్పూర్ యు, జైనూర్, లింగాపూర్ మండలల్లోని ఆదివాసీ గూడలో ఎన్నో యేండ్లు గా నివసిస్తున్న ఆదివాసీ ప్రజల పట్ల అటవీ శాఖ అధికారులు లేని పోనీ ఆంక్షలు విదిస్తూ అభివృద్ధి కి అడ్డు పడుతునరాని ఆరోపించారు. ఈ మండలల్లో ప్రతి గూడా నలభై యేండ్లు నుండి వందకు పైన చరిత్ర కలిగి ఉందన్నారు. ఇలాంటి గ్రామాలకు అటవీ శాఖ భూములలో ఉన్నారంటు ఇబ్బంది చేయడం వారికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోకుండా, ఇండ్లలో అంతర్గత రోడ్లు నిర్మించుకోకుండా ఆంక్షలు విధించడం ఎక్కడి న్యాయం అన్నారు.

అడవిని నమ్ముకొని నివసిస్తున్న ఆదివాసి ప్రజలను లేని పోనీ ఆంక్షలతో ఇబ్బందూలకు గురి చేస్తే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. 1/70 పిసా చట్టం, ఏజెన్సీప్రాంతం లాంటి ఎన్నో చట్టాలను భారత రాజ్యాంగం తమకు కల్పించిందన్నారు. అయినప్పటికి వాటికీ విరుద్ధంగా అటవీ శాఖ వ్యవహరిస్తుంది అన్నారు.ఆదివాసీ గూడలో అటవీ శాఖ అధికారుల ఆంక్షలు విధించడం సరి కాదన్నారు. కొన్ని గ్రామాలల్లో ఇండ్లు లోని అక్రమంగా చొరబడి వారిని బయ బ్రాంతులకు గురు చేస్తున్నారు.

తాము ముత్తాత కాలం నుండి సాగు చేసుకుంటున్న భూములు ఇప్పుడు అటవీ శాఖ పరిధి లోనికి ఎలా వెల్లాయని  ప్రశ్నించారు. అడవి తల్లిని, భూములు నమ్ముకొని నివాసం ఉంటున్న ఆదివాసీ ప్రజల పట్ల ఇలాంటి ఆంక్షలు విదిస్తూ ఇబ్బందులకు గురి చేస్తే కొమురంభీం, భీర్ష ముండా లాగా మరో భూ పోరాటం చేయవాలిసి వస్తుందన్నారు. అవసరం అయితే అటవి శాఖ కార్యాలయాలను, సీఎం ఇంటిని కూడా మూతడిస్తామన్నా. అటవీ శాఖ అధికారులను ఆదివాసీ గుడాల్లో తిరిగానివ్వ బొమని హెచ్చరించారు.

ఫారెస్ట్ అధికారుల, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటు భారీ నినాదాలు చేశారు. తమ డిమాండ్లుకు సమాధానం చెప్పడానికి అటవీ శాఖ అధికారుల ధర్న చోటికి రావాలంటు పట్టు పట్టారు. దీంతో జైనూర్ సిఐ రమేష్ ఆధ్వర్యంలో జోడేఘాట్ రేంజ్ అధికారి రమేష్ ధర్న వద్దకు వచ్చారు. నాయకులు అడిగే ప్రశ్నలకు అయన సమాధానం ఇస్తూ ఆదివాసీ ప్రజలకు తాము కావాలని ఇబ్బందులు చేయడం లేదని సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా వారి అధీనంలో ఉన్న పట్టా భూములు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేదన్నారు.

అటవీ శాఖ పరిధిలో ఉండే భూములలో తవ్వాకాలు జరపడం రోడ్లు వేయడం, చెట్లను నరకడం లాంటి వి చేసినపుడే సమస్య తలలేతుందన్నారు. తమకు ఇలాంటి నిర్మాణాలు కావాలన్నా అనుమతి తీసుకోని నిర్మించాలన్నారు. అనంతరం ఆదివాసీ నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం లో జైనూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భాగవంత్ రావ్, తుడుం దెబ్బ జిల్లా నాయకులు కనక ప్రభాకర్, కోవా విజయ్, మధుకర్, కొమురంభీంరావ్, పెందోర్ ప్రకాష్, వివిధ గ్రామాల, మండలాల నుండి వచ్చిన ప్రజలు, తదితరులు పాల్గున్నారు.

మరిన్ని వార్తలు