మున్సిపల్ కార్మికులకు అండగా టిఆర్ఎస్ పార్టీ
టిఆర్ఎస్ టి యు అధ్యక్షులు వీరన్న
కాగజ్నగర్, అక్టోబర్ 16 ( విజయక్రాంతి) : మున్సిపల్ కార్మికులు జీతాల(Municipal workers' salaries) కోసం చేస్తున్న ఆందోళనకు తెలంగాణ రక్షణ సమితి(Telangana Rakshana Samithi) ( టిఆర్ఎస్) అండగా ఉంటుందని ఆ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బి. వీరన్న, సిర్పూర్ నియోజకవర్గం ఇంచార్జ్ కావేటి సబిత--మనోహర్ లు అన్నారు. శుక్రవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమం 3 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే టిఆర్ఎస్ పార్టీ వారికి న్యాయ సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా కార్మికులకు వారు హామీ ఇచ్చారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా కనీసం ఇచ్చే తక్కువ జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనీ ఈ విషయం లో తన ఆవేదన ను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
కార్మికులకు రావలసిన రు.1.50 కోట్ల పిఎఫ్ డబ్బులు కార్మికుల అకౌంట్లో జమ చేయకపోవడంపై క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని పోలీస్ అధికారులను వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ మాన్ కార్, ప్రచార కార్యదర్శి కావేటి మనోహర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
"పాంచ జన్య సంకల్ప సభ" పోస్టర్ల ఆవిష్కరణ
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఈనెల 30వ తేదీన జరిగే తెలంగాణ రక్షణ సమితి ( టిఆర్ఎస్ ) "పాంచ జన్య సంకల్ప సభ " పోస్టర్లను ఆ పార్టీ నాయకులు వీరన్న, సబిత-- మనోహర్ తదితరులు ఆవిష్కరించారు. కాగజ్నగర్ పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కావేటి సబిత--మనోహర్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో" పాంచ జన్య సంకల్ప సభ " పోస్టర్లను ఆవిష్కరణ లభించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం, వ్యవసాయం ఫలాలను ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా తమ పార్టీ అధినాయకరాలు కల్వకుంట్ల కవిత అధ్యయనం చేసి ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో తమ పార్టీ అధినాయకరాలు చేసిన ఆందోళనల తో ప్రభుత్వం దిగివచ్చి సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లో ఎన్నికలు జరిపించిందని అన్నారు.