అంగరంగ వైభవంగా అట్ల బతుకమ్మ సంబరాలు

16-10-2026 | 08:06pm

భిక్కనూర్, అక్టోబర్‌ 16 (విజయ క్రాంతి): భిక్కనూర్‌ మండలంతో పాటు పరిసర గ్రామాల్లో అట్ల బతుకమ్మ సంబరాలను(Bathukamma celebrations) మహిళలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఒకే రకమైన చీరలు ధరించి బతుకమ్మలను అందంగా పేర్చి, వాటి చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు.

సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామాల్లోని స్థానిక చెరువుల వద్దకు చేరుకుని బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. మహిళల కోలాహలం, బతుకమ్మ పాటలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు