ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి టీఆర్ఎస్ మద్దతు
ఆసిఫాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ఎన్హెచ్ఎం ఉద్యోగులు(NHM Employees) చేస్తున్న న్యాయమైన పోరాటానికి తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) (టీఆర్ఎస్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులను టీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు కలిసి తమ సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక సంఘం టీఆర్టీయూ అధ్యక్షుడు దేవళ్ల వీరన్న(Devalla Veeranna) మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వమే కారణమని విమర్శించారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను త్వరగా పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి లేఖ రాయించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బానోత్ కిషన్ నాయక్, బుక్యా సంజీవ్ నాయక్, జిల్లా అధ్యక్షుడు కిర్మిల్ల వినోద్ చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ మోహల్కర్, మహిళా విభాగం అధ్యక్షురాలు చౌహాన్ పుష్పలత, ఎన్హెచ్ఎం ఉద్యోగుల జేఏసీ నాయకురాలు వనిత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.