యువకుడికి కలెక్టర్ చేయూత
23-11-2026 | 04:42pm
జనగామ, నవంబర్ 23 (విజయక్రాంతి): జఫర్‌గఢ్ మండలం వడ్డెగూడెం గ్రామానికి(Vaddegudem village) చెందిన తాటికాయల భాస్కర్ విద్యుదాఘాతంతో వెన్నెముకకు తీవ్ర గాయమై నడవలేని స్థితిలో ఉన్నాడు. భార్య, ముగ్గురు పిల్లలతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) ఆదేశాలతో కలెక్టరేట్‌లో కలెక్టరేట్ పరిపాలన అధికారి వై. రవి కిరణ్, జఫర్‌గఢ్ తహసీల్దార్ శ్రీనివాస్ బాధిత కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు.