సాలూరలో పశువులకు అమ్మవారి వ్యాధి నివారణ టీకాలు

23-11-2026 | 04:30pm

​సాలూర, నవంబర్ 23(విజయక్రాంతి) : ​చలికాలంలో గొర్రెలు, మేకలకు సోకే అమ్మవారి వ్యాధి బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్‌ఛార్జ్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్(Veterinary Officer Dr. Santosh) తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి 26వ ​తేదీ వరకు ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సోమవారం సాలూర మండల కేంద్రంలో గొర్రెలు, మేకలకు టీకాలు వేశారు. ​

ఈ సందర్భంగా ఆయన ​ మాట్లాడుతూ.. గొర్రెలు, మేకలకు ఒక్కసారి టీకా వేయించుకుంటే మూడేళ్ల వరకు అమ్మవారి వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. కాపరులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే​ ​సాలంపాడ్​​, ​ కుమ్మన్ పల్లి గ్రామాల్లోని గొర్రెలు, మేకలకు టీకాలు వేసినట్లు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు సభ్యుడు సాయినాథ్ గిరి, సోక్కం​​ రవి, గొర్రెల కాపరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు