పంటలు ఎండుతుంటే.. ఇతర రాష్ట్రాలకు ఇస్తారా

06-10-2026 | 02:22pm

హైదరాబాద్, అక్టోబర్ 6: బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) హయాంలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేశామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ (24-Hour Power) అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం పంటలు ఎండిపోతుంటే తెలంగాణ విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఇచ్చేందుకు ఒప్పందాలు (Agreements) చేసుకోవడమేంటని ప్రశ్నించారు. నీరు, బొగ్గు వంటి వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సమర్థంగా వినియోగించుకోవడం లేదని ఆరోపించారు.

విద్యుత్ ఉత్పత్తి సంస్థలు మూతపడుతున్నాయని హరీశ్‌రావు విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు పుష్కలంగా వస్తున్నా.. ఆ నీటిని ఏపీ వినియోగించుకుంటోందని అన్నారు. కరోనా, ఎల్‌నినో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రైతులకు ఎక్కువ నష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు