నూతన సభ్యత్వ ప్రక్రియ పూర్తవ్వాలని ఎల్లమ్మ తల్లి కి పూజలు
గణపురం,అక్టోబర్ 06 (విజయ క్రాంతి): మండల కేంద్రానికి చెందిన గౌడ యూత్ సభ్యులు(Gouda youth members) నూతన గౌడ సంఘం సభ్యత్వ ప్రక్రియ త్వరగా, పూర్తి కావాలని ఆకాంక్షిస్తూ కులదైవం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో (Sri Renuka Yellamma Temple)మంగళ వారం ప్రత్యేక పూజలు నిర్వహించారు .పూలు, కొబ్బరికాయలు సమర్పించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు.
ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ.. గత వంద సంవత్సరాలుగా గౌడ కులస్తులకు రేణుక ఎల్లమ్మ, కాటమయ్య దేవాలయాలు లేకపోవడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గౌడ కులస్తుల కోసం రూ.50 లక్షలతో రేణుక ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి కృషి చేయడం అభినందనీయమని అన్నారు. గౌడ సమాజం తరఫున ఎమ్మెల్యే గండ్ర కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.