వడ్డే ఓబన్న వర్ధంతి వేడుకలు ఘనంగా
చివ్వెంల, అక్టోబర్ 6 (విజయక్రాంతి): చివ్వెంల గ్రామంలో వడ్డే ఓబన్న వర్ధంతి వేడుకలను వడ్డెర కుల సంఘం(Vaddara Caste Association) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వడ్డెర కుల సంఘం అధ్యక్షులు తుర్క నాగరాజు, గ్రామ పెద్దలు, సర్పంచ్ కళ్యాణి నగేష్, ఉప సర్పంచ్ మౌనిక హరీష్, మాజీ సర్పంచ్ జులకంటి సుధాకర్ రెడ్డి, మిర్యాల గోవిందరెడ్డి, సుంకిరెడ్డి అంజిరెడ్డి, కోడి వెంకన్న, శిగ నర్సయ్య, కందుల నర్సిరెడ్డి, ఎల్క కృష్ణారెడ్డి, బచ్చలి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే చివ్వెంల వడ్డెర కుల సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై వడ్డే ఓబన్నకు ఘనంగా నివాళులర్పించారు.